Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఏఎఫ్ఆర్సీ సమాలోచన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంజినీరింగ్ కాలేజీల ఫీజుల పెంపునకు టీఏఎఫ్ఆర్సీ (తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిషన్) కసరత్తు చేస్తున్నది. అందులో భాగంగా శనివారం హైదరాబాద్లో ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలతో కమిషన్ సమావేశాన్ని నిర్వహించింది. విశ్వసనీయ సమాచారం మేరకు ఆయా కాలేజీల ఫీజులను 25 శాతం వరకూ పెంచాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఇవి 2022-23, 2023-24, 2024-25 (మూడు విద్యా సంవత్సరాలు) వరకూ అమల్లో ఉండనున్నాయి. అయితే జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సిఫారసుల ప్రకారం... ఫీజులను ఖరారు చేయాలని ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలు టీఏఎఫ్ఆర్సీని కోరినట్టు తెలిసింది. కాలేజీల్లోని బోధన, బోధనేతర సిబ్బందికి ఏడో వేతన కమిటీ సిఫారసులను అమలు చేయని కారణంగా శ్రీకృష్ణ కమిటీ సిఫారసుల ప్రకారం... ఫీజులు పెంచేందుకు టీఏఎఫ్ఆర్సీ నిరాకరించినట్టు సమాచారం.