Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
మహానాడులోగా సభ్యత్వం పూర్తిచేయాలని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు. శనివారం తెలుగుదేశం తెలంగాణ శాఖ నేతలతో ఆయన సమావేశం అయ్యారు. టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై చర్చించారు. ప్రస్తుతం ఖమ్మం, హైదరాబాద్ మినహా మిగతా రాష్ట్రమంతా మందకొడిగా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతున్నదని చెప్పారు. సభ్యత్వ నమోదు నూతన విధానంపై అవగాహన లేక ఇబ్బంది పడుతున్నామని పలువురు నేతలు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. దీనికి స్పందనగా సభ్యత్వ నమోదుపై నేతలకు చంద్రబాబు పలు సూచనలు చేశారు. ఇందుకోసం నియోజకవర్గ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశారు. రంజాన్ దష్ట్యా పేద ముస్లిం మహిళలకు చంద్రబాబు చీరలు పంపిణీ చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు, రాష్ట్ర ఇన్‌ఛార్జి కంభంపాటి రామ్మోహన్రావు, పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి నన్నూరి నర్సిరెడ్డి, జక్కలి ఐలయ్య యాదవ్, తెలుగుమహిళ అధ్యక్షులు టి.జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.