Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులను మోసం చేస్తున్న మోడీ, కేసీఆర్
- కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఒకేసారి రుణమాఫీ : కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్
నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా
మే 6న హన్మకొండలోని ఆర్ట్స్అండ్ సైన్స్ కళాశాలలో రాహుల్‌గాంధీ సభను చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్ అన్నారు. ఫాతిమానగర్ సెయింట్ గ్యాబ్రియల్ స్కూల్ మైదానంలో హెలికాప్టర్ ల్యాండింగ్, ఆర్ట్స్ కాలేజీ మైదానంలో రైతు సంఘర్షణ సభ వేదిక ఏర్పాట్లను శనివారం ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాణిక్యం ఠాకూర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పునర్ వైభవానికి వరంగల్ సభ తొలిమెట్టు అన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా, గిట్టుబాటు ధర కల్పించకుండా కేంద్రంలో ప్రధాని మోడీ, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని చెప్పారు. చనిపోయిన రైతు కుటుంబాలను ఆదుకోవాలని, రైతులకు రూ.లక్ష రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పాలనలో రైతులకు మేలు జరగలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఒకేసారి రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసి కనీస మద్దతు ధర ఇవ్వాలనే డిమాండ్లతో ఈ సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. సభకు లక్షలాదిగా రైతులు, ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు.
పొన్నాల ఇంట్లో తేనీటి విందు
హన్మకొండ రాంనగర్లో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య నివాసంలో తేనీటి విందుకు మాణిక్యం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శులు శ్రీనివాసన్ కృష్ణన్, బోస్ రాజు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.అంజన్‌కుమార్ యాదవ్ తదితరులు హాజరయ్యారు.
కార్యక్రమంలో వరంగల్ జిల్లా ఇన్చార్జి సంభాని చంద్రశేఖర్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు వేం నరేందర్ రెడ్డి, హెచ్.వేణుగోపాల్, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అద్యక్షుడు అన్వేష్‌రెడ్డి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, వరంగల్ జిల్లా అధ్యక్షులు నాయిని రాజేందర్‌రెడ్డి, నాయకులు జంగా రాఘవరెడ్డి, నల్లెల కుమారస్వామి, ఆయిత ప్రకాష్ రెడ్డి, దొమ్మాటి సాంబయ్య, ఇనగాల వెంకట్రాంరెడ్డి, సింగాపురం ఇందిర, నమిండ్ల శ్రీనివాస్, గండ్ర సత్యనారాయణ, ఎం.లింగాజీ పాల్గొన్నారు.