Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఎంపీడీఓల సమస్యల పరిష్కరించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును ఎంపీడీఓల సంఘం కోరింది. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లోని మినిష్టర్స్ క్వార్టర్స్‌లో మంత్రికి ఎంపీడీఓలు వినతిపత్రం అందజేశారు. డీసీఇఓలుగా పదోన్నతులు, డిప్యూటేషన్లు, బదిలీలు, సెలవుల వినియోగం, ఉపాధి హామీ చట్టం అమలు వంటి అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆయా సమస్యలను పరిశీలిస్తామని మంత్రి వారికి హామీనిచ్చారు.