Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నష్టపరిహారంపై కలెక్టర్ స్పష్టతివ్వాలని డిమాండ్
నవతెలంగాణ-బోనకల్
నాగపూర్ - అమరావతి జాతీయ రహదారి భూ సర్వేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోనకల్ మండల పరిధిలోని తూటికుంట్ల గ్రామంలో శనివారం రైతులు అడ్డుకున్నారు. గ్రామంలో ఖమ్మం ఆర్డీవో మల్లాది వెంకట రవీంద్రనాథ్ శుక్రవారం రైతులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. రైతులు తమ సారవంతమైన భూములను ఇవ్వబోమని సమావేశంలోనే స్పష్టం చేశారు. ప్రాథమిక సర్వేకు సహకరించాలని ఆర్డిఓ కోరారు. అందుకు కూడా రైతులు అంగీకరించలేదు. అయినా బోనకల్ గీర్దావర్లు జి.సత్యనారాయణ, గూగులోతు లక్ష్మణ్, సర్వేయర్ చీమలపాటి శ్రావణి, గ్రీన్ ఫీల్డ్ హైవే అధికారులు అజరు మరికొందరు కలిసి శనివారం గ్రామంలో భూసర్వేకు వెళ్లారు. విషయం తెలుసుకున్న రైతులు అక్కడికొచ్చి పెట్టిన గుర్తులను పీకేశారు. అధికారుల వాహనాన్ని కదలనివ్వకుండా అడ్డుకున్నారు. కలెక్టర్ తమకు నష్టపరిహారంపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు సర్వే చేయడానికి వీలు లేదని హెచ్చరించారు. దీంతో అధికారులు వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు పాపినేని రామనర్సయ్య తుల్లూరు రమేష్ .పాపినేని కృష్ణ, సాదినేని రాంబాబు, రైతులు పాపినేని శ్రీనివాసరావు, కోలేటి సత్యనారాయణ, కోలేటి నాగేశ్వరరావు, సాధినేని గురవయ్య, కోలేటి నరేష్, గుమ్మ వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.