Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కష్టజీవికి కాపలా కాయాలి:
- తెలంగాణ సాహితి ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి
- మేడే సందర్భంగా కవి సమ్మేళనం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కవి అనేవాడు ఎల్లప్పుడూ సత్యం వైపే నిలబ డాలని తెలంగాణ సాహితీ ప్రధాన కార్యదర్శి కె.ఆనం దాచారి కోరారు. కష్టజీవులకిరువైపులా కాపలా కాసే వాడే నిజమైన కవి అని శ్రీశ్రీ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఆదివారం హైదరాబాద్‌లో మేడే సంద ర్భంగా తెలంగాణ సాహితీ ఆధ్వర్యంలో ఆ సంఘం సహాయ కార్యదర్శి ఎస్కే సలీమా అధ్యక్షతన కవి సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నేటి సమాజంలో కార్మికుడు దోపిడీకి గురయ్యే తీరు మారిందనీ, ప్రతి ఒక్కరూ తమ అవసరాలు, అనివార్య పరిస్థితుల కారణాల వల్ల 10 గంటల నుంచి 14 గంటలు పనిచేస్తున్న పరిస్థితి నెలకొందని వివరించారు. అలా యాజమా న్యాలు శక్తినంతా పిండేయటం వల్ల శ్రామికులు పదేం డ్ల కంటే ఎక్కువ పనిచేయలేరనీ, తమ శక్తిని కోల్పో తారని ఆందోళన వ్యక్తం చేశారు. మతం, ప్రాంతం, కులం, వర్ణం, లింగం, పేరిట పాలకులు, యాజ మాన్యాలు కార్మికులను చీల్చి ఉంచుతున్న పరిస్థితి కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నదన్నారు. సాధారణమైన కార్మికులు సంఘటితం కావాలనే కోరిక నుంచి పుట్టుకొచ్చిందే మేడే అన్నారు. బలవంతమైన సర్పం చలిచీమల చేతిలో చావక తప్పదు అని అప్పుడెప్పుడో సుమతీ శతకం ద్వారా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. తాము పెట్టిన పుట్టను పాము ఆక్రమిం చుకుని దోపిడీ చేస్తే ఊరుకోబోమని చీమలు తిరుగు బాటు చేసినట్టే..నేడు సమాజంలో కార్మికులంతా ఐక్యమై పెట్టుబడిదారులపై తిరుగబడే రోజులు వస్తా యనీ, పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు అనే నినాదం వెనుక ఆ పద్యం సారం, అంతర్యం ఉందని చెప్పారు. సంపద సృష్టికర్తలు పెట్టుబడి దారులు కాదు శ్రామికులేనని నొక్కి చెప్పారు. తెలం గాణ సాహితీ ఎల్లప్పుడూ కార్మికుల పక్షం వహిస్తుం దని హామీనిచ్చారు. తెలంగాణ సాహితీ రాష్ట్ర నాయ కులు రాంపల్లి రమేశ్ మాట్లాడుతూ.. ఈ కవిసమ్మే ళనం పెద్దలు ఎంత మంది ఉన్నారో యువకులు కూడా అంతే ఉండటం మంచి పరిణామం అని ప్రశంసించారు. వారంతా శ్రమైక జీవన సౌందర్యాన్ని అర్థం చేసుకుని నేటి కవిత్వాన్ని రాశారన్నారు. తెలంగాణ సాహితీ ఉపాధ్యక్షులు నస్రీన్‌ఖాన్, అనంతోజు మోహన్‌కృష్ణ, తంగిరాల చక్రవర్తి ఆధ్వర్యంలో శ్రామిక కవిసమ్మేళనాన్ని నిర్వహించారు.
ఆలోచింపజేసిన కవి సమ్మేళనం
'బారులు, బీర్ల ప్రవాహంలో నన్ను నేను నిలబెట్టుకునే శ్రమతత్వం నాది...ఈదులు, బొత్తలు, పోతాళ్లు, కర్రలే నా బలం..' అంటూ ఎం.స్వామి అనే కవి 'తపన' శీర్షిక ద్వారా ప్రపంచీకరణ వల్ల తన జీవనోపాధిని కాపాడుకునేందుకు గీతకార్మికుని శ్రమత్వాన్ని చాలా చక్కగా వివరించారు. 'శ్రమైక జీవన సౌందర్యం' కవిత ద్వారా కార్మికుల శ్రమను తక్కువ చేసి చూసే మన దృష్టి లోపాన్ని కొండామోహన్ ఎత్తిచూపారు. ప్రభాకరాచారి అనే కవి 'మార్పు రావాలి' అనే కవిత ద్వారా మహిళలు, డెలివరీ బారులు, ఆయా రంగాల కార్మికులు పడుతున్న కష్టాలను కండ్లకు కట్టినట్టు చూపారు. సమాజంలో మార్పు రావాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులు చిల్లరగాళ్లు అని అన్న ఇతివృత్తాన్ని తీసుకుని ఏ నర్సింహ్మ అనే కవి..ఆర్టీసీ కార్మికులు పడుతున్న బాధలు, వారంతా ఒక్కటై పోరాడాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతూ...'అవును నిజమే అన్నాడు..తెలిసి అన్నాడో..తెలియక అన్నాడో..ఒకప్పుడు ఒక్కటిగా కొట్లాడేటోళ్లం..నేడు పాలకుల కుట్రలతో విడిపోయి పోరాడుతున్నాం..ఐక్యంగా ఉంటే ఇలా అనేటోడా?' అనే కవితను చదివి వినిపించారు. భవన నిర్మాణ రంగంలో మహిళా కార్మికులు పడే బాధలను ఆకాశ్ తన కవిత ద్వారా కండ్లకు కట్టినట్టు చూపారు. మహేశ్ అనే యువకవి అడ్డాల మీద పని కోసం ఎదురుచూసే కూలీల కష్టాలను 'కూలిఅడ్డా' అనే కవిత ద్వారా హృదయవిదారకంగా వివరించారు. శ్రమైక జీవన సౌందరాన్ని, పోరాటాల ఆవశ్యకతను వివరిస్తూ 'నిజం', 'మళ్లీ మొలకెత్తుతాయి', 'శ్రమైకజీవనం', 'విప్లవస్వైరం', 'దారిపొడవునా ఉద్యమపాఠాలు', తదితర కవితలను కవులు వినిపించారు. కవులందరికీ సాహితీ ఆధ్వర్యంలో ప్రశంసాపత్రాలను, పుస్తకాలను అందజేశారు.