Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రొఫెషనల్ కోర్సులలో 25 శాతం ఫీజులు పెంచాలనే ఆలోచనను విరమించుకోవాలని ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎల్.మూర్తి, రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా కారణంగా గత రెండేండ్లుగా విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ, ఉపాధి అవకాశాలు లేవని తెలిపారు. ఇలాంటి సమయంలో ఫీజులు పెంచడమంటే పేద వర్గాల విద్యార్థులను ప్రొఫెషనల్ విద్యకు దూరం చేయడమే అవుతుందని చెప్పారు. టాప్లో ఉన్న ఇంజినీరింగ్ కాలేజీల్లో డొనేషన్ల పేరుతో అడ్మిషన్లు తీసుకుంటూ లక్షల రూపాయల ఫీజులను అక్రమంగా వసూలు చేస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఫీజులు పెంచితే ఎక్కువ మంది విద్యకు దూరమయ్యే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్న ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రమాణాలు మాత్రం ఉండటం లేదని వెల్లడించారు. 25 శాతం ఫీజుల పెంపు ఆలోచన విరమించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.