Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మినిష్టర్ క్యార్టర్స్ ముట్టడించిన యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ
- అరెస్టు చేసిన పోలీసులు
- పరామర్శించేందుకు వెళ్లిన జగ్గారెడ్డి అరెస్టు
- ఖండించిన రేవంత్, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి
- పోలీసుస్టేషన్‌కు వెళ్లిన ఉత్తమ్, వీహెచ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో మేధోమథనం నిర్వహించేందుకు కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్‌గాంధీకి అనుమతి లభించకపోవడంతో టెన్షన్...టెన్షన్ మొదలైంది. కాంగ్రెస్ విజ్ఞప్తిని రిజిస్ట్రార్ తిరస్కరించడంతో యూత్‌కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ నేతలు బంజారాహిల్స్్ మినిష్టర్ క్వార్టర్స్‌ను ముట్టడించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట, వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో నాయకులను పోలీసులు అరెస్టు చేసి, బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ తరలించారు. వారిని పరామర్శించేందుకు వెళ్లిన ఆపార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎంపీ ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీ వి హనుమంతరావు పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. ఉస్మానియా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ఓయూకు రాహుల్‌గాంధీ వస్తే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి, యూత్‌కాంగ్రెస్, విద్యార్థి నేతల అరెస్టును టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఖండించారు. పోలీసులు ఇలా నిర్బంధించడం పాశవిక పాలనకు పరాకాష్ట అన్నారు. రాహుల్‌గాంధీ పర్యటన కేసీఆర్ వెన్నులో వణుకు పుట్టిస్తున్నదన్నారు. రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్‌గాంధీ ఓయూకి వస్తామంటే అడ్డుకోవడం ఎందుకని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా? నియంతరాజ్యంలో ఉన్నామా? అని నిలదీశారు. కేసీఆర్ కుటుంబం అనుభవిస్తున్న భోగాలన్నీ సోనియగాంధీ, రాహుల్‌గాంధీ బిక్ష అని చెప్పారు. కేసీఆర్ ఒక పిరికి పాలకుడనీ, ఆయన పాలనకు మరో 12 నెలలు మాత్రమే గడువు ఉందన్నారు. పోలీసుస్టేషన్లో పరామర్శించేందుకు వెళ్లిన వారిని ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. అనంతరం గాంధీభవన్‌లో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్, మల్లు రవి, దాసోజు శ్రవణ్, సంగిశెట్టి జగదీశ్వర్‌రావు, సుధీర్‌రెడ్డి జరిగిన విలేకర్లతో మాట్లాడారు. జగ్గారెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండించారు.