Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి జి నర్సింహారావు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మేడే స్పూర్తితో పోరాటాల ద్వారా కార్మిక హక్కులను కాపాడుకోవాలనీ, మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లను, ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను వ్యతిరేకించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కేవీఆర్ యూనియన్ అధ్యక్షులు డి జి నర్సింహారావు అని చెప్పారు. ఆదివారం మేడే సందర్భంగా కార్మికులతో కలిసి ఆయన జెండాను ఆవిష్కరించారు. చట్టాలు సవరణను, ఇతర సమస్యలను కార్మికులంతా ఐక్యపోరాటాల ద్వారా ఎదుర్కొవాలని కార్మికులకు పిలుపునిచ్చారు. కార్మికులంతా ఐక్యంగా ఉండి మరిన్ని మంచి అగ్రిమెంట్స్ చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షులు కె. శ్రీనివాస్‌నాయక్, ప్రధాన కార్యదర్శి వి.సురేష్, కోశాధికారి హరినాథ్, ఆర్.నర్సింహులు, సయ్యద్ అలీ, వి.రత్న సంజీత్‌సింగ్, తిరుపతయ్య, బాలాజీ సింగ్, రామకష్ణ, సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు.