Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టులకు దరఖాస్తు చేసే ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. గతనెల 26వ తేదీన 503 పోస్టుల భర్తీకి తెలంగాణ తొలి గ్రూప్-1 నోటిఫికేషన్‌ను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆన్లైన్లో దరఖాస్తుల సమర్పణకు తుదిగడువు ఈనెల 31వ తేదీ వరకు అవకాశమున్నది. ఇంటర్వ్యూలు లేకుండానే రాతపరీక్ష ఆధారంగా గ్రూప్-1 నియామకాల ప్రక్రియ ఉంటుందని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. ప్రిలిమ్స్‌ను ఆబ్జెక్టివ్ విధానంలో 33 జిల్లాల్లోనూ జులై/ఆగస్టులో, మెయిన్స్‌ను రాతపరీక్ష ఆధారంగా నవంబర్/డిసెంబర్లో నిర్వహిస్తున్నట్టు టీఎస్పీఎస్సీ ప్రక టించింది. అయితే గ్రూప్-1కు దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థు లు టీఎస్పీఎస్సీ వన్‌టైం రిజిస్ట్రేషన్ (ఓటీఆర్)ను తప్పనిసరిగా చేసుకోవాల్సిన అవసరమున్నది.