Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో కార్మికులకు సేవలు అందిస్తున్న పారిశ్రామిక ట్రిబ్యునల్, లేబర్ కోర్టును తక్షణమే విభజించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్లోనిమంత్రుల నివాసంలో ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్మిక సంఘాల నాయకులు, ప్రతినిధులు ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల విభజన జరిగి దాదాపు ఎనిమిదేండ్లు పూర్తి కావస్తున్నా ఇంకా పారిశ్రామిక ట్రిబ్యునల్ మరియు లేబర్ కోర్టు విభజన జరగక పోవడంవల్ల తెలగాణ రాష్ట్ర కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. లెక్కలేనన్ని కేసులు సత్వర పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు.