Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సమస్యల పరిష్కారం కోసం పోరాటం తప్పనిసరి అనీ, దానికి మేడే స్ఫూర్తినిస్తుందని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు కే జంగయ్య అన్నారు. మేడే సందర్భంగా ఫెడరేషన్ కార్యాలయంలో ఆయన ఆరుణపతాకాన్ని ఆవిష్కరించి, మాట్లాడారు. పెట్టుబడిదారుల ప్రయోజనాలకు కొమ్ముకాసే పాలకుల వైఖరివల్లే అభివృద్ధి ఫలాలు అందరికీ చేరట్లేదని చెప్పారు. పూర్తి వేతనంలో నియమితులయ్యే ఉద్యోగ, ఉపాధ్యాయుల స్థానంలో కాంట్రాక్టు, అప్రెంటీస్, స్పెషల్ టీచర్లు, పార్ట్‌టైం టీచర్ల నియామకం గురించి ఏం చెప్తారని ప్రశ్నించారు. ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి చావ రవి మాట్లాడుతూ విద్యారంగ పరిణామాలు బడుగు బలహీనవర్గాల ప్రజల్ని దూరం చేసేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకున్న పెన్షన్ వంటి సౌకర్యాలను ఇప్పుడు కోల్పోతున్నామని అన్నారు. కార్యక్రమానికి టీఎస్‌యూటీఎఫ్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు శ్యామ్‌సుందర్ అధ్యక్షత వహించారు. వాయిస్ ఆఫ్ తెలంగాణ టీచర్ ప్రధాన సంపాదకులు పీ మాణిక్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి శారద, రాష్ట్ర కమిటీ సభ్యులు సరళ, వెంకటప్ప, జగన్నాధ్, మస్తాన్‌రావు తదితరులు పాల్గొన్నారు.