Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సత్యవతి రాథోడ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కార్మికులు, కర్షకుల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గిరిజన, మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. మేడే దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి ఒక ప్రకటనలో కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. సంఘటిత, అసంఘటిత రంగాలు అన్న వ్యత్యాసం లేకుండా సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమానికి సమానంగా కృషి చేస్తున్నారని చెప్పారు. నిర్మాణ రంగంలోని కార్మికుల సంక్షేమానికి బోర్డు ద్వారా గత ఏడాదిలో రూ 176.91 కోట్లు కార్మికులకు లబ్ది చేకూర్చినట్టు తెలిపారు. అదేవిధంగా గత ఆర్థిక సంవత్సరంలో వివిధ పథకాల ద్వారా 32,350 మంది కార్మికులకు రూ 184.07 కోట్ల ప్రయోజనం కలిగిందని పేర్కొన్నారు.