Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి శ్రీనివాస్‌గౌడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వెయిట్ లిప్టింగ్లో సిల్వర్ మెడల్ సాధించిన వారికి రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ఆదివారం హైదరాబాద్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో అభినందనలు తెలిపారు. రాష్ట్ర క్రీడా పాఠశాల (హకీమ్ పేట)కు చెందిన డి గణేష్ కర్ణాటక రాజధాని బెంగుళూరులోని జైన్ యూనివర్సిటీలో ఈ నెల 23 నుంచి 27 వరకు జరిగిన ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో వెయిట్ లిఫ్టింగ్ 81 కేజీ విభాగంలో సిల్వర్ మెడల్ సాదించారని తెలిపారు. అర్చరీలో ఎస్ఏఐఎన్సీఒఈ స్కీమ్‌లో హర్యానా సోనిపట్‌కు ఎంపికైన ఎస్ శ్రీను, కె అభినయ్, కోల్‌కతా ఎస్ఏఐఎన్సీఒఈకి ఎంపికైన శివ సాయిలను అభినందించారు.