Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పెండింగ్‌లో ఉన్న ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్ బకాయిలు రూ.3,200 వెంటనే విడుదల చేయాలని పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం పరుశరాములు, ప్రధాన కార్యదర్శి ఈ విజరుకన్నా సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 13లక్షల మంది విద్యార్థులు ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు.ఫీజులు చెల్లిస్తేనే ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యా ర్థులకు సర్టిఫికెట్లు ఇస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ,ఎస్టీ,ఈబీసీ విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.