Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్విట్టర్ వేదికగా మంత్రి ఎర్రబెల్లిని అభినందించిన మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పంచాయతీరాజ్ శాఖ ఆడిటింగ్‌లో దేశంలోనే తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మరోమారు మొదటి స్థానంలో నిలిచింది. దీనిపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును అభినందిస్తూ మంత్రి కేటీఆర్ సోమవారం ట్వీట్ చేశారు. రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలు, 540 మండలాలు, 32 జిల్లా పరిషత్లున్న తెలంగాణ రాష్ట్రం వరసగా రెండో సారీ నేషనల్ లీడ్ స్టేట్‌గా నిలవడం గర్వించదగ్గ విషయమన్నారు. కేంద్ర ప్రభుత్వం ర్యాంకులు, అవార్డులు ఇచ్చినట్టే నిధులు కూడా ఇవ్వాలని కోరారు. దేశంలో 100 శాతం ఆడిట్ సాధించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలవడం వెనుక తమ శాఖ ఉన్నతాధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కృషి మరువలేనిదనీ, ప్రతిఒక్క ఉద్యోగికి అభినందనలు తెలుపుతున్నట్టు చెప్పారు.