Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను వెంటనే ప్రకటించాలని తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (టీఎంఎస్టీఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆర్థిక మంత్రి టి హరీశ్‌రావును ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూతం యాకమల్లు, ప్రధాన కార్యదర్శి కె నగేశ్, మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ నెలలోనే బదిలీలు, పదోన్నతులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సంబంధిత అధికారులతో సంప్రదిస్తామని మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు.