Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గేట్లు, తూములకు మరమ్మతులు చేయాలి :రజత్‌కుమార్ ఆదేశం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ప్రాజెక్టుల నుంచి చుక్క నీరు కూడా లీక్ కాకుండా చూడాలనీ, గేట్లు, తూములకు సంబంధించిన మరమ్మతులు ఉంటే వెంటనే పూర్తి చేయాలని తెలంగాణ సాగునీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఇరిగేషన్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్టుల పనుల పురోగతి, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో జలసౌధలో రజత్ కుమార్ సోమవారం ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రజత్‌కుమార్ మాట్లాడుతూ లక్షల కోట్ల నిధులను వెచ్చిస్తూ అనేక ప్రాజెక్టులను ప్రభుత్వం నిర్మిస్తున్నదనీ, ఈ నేపథ్యంలో వాటి నిర్వహణ, పర్యవేక్షణపై కూడా ప్రత్యేక దష్టిని సారించాలని సూచించారు. ప్రాజెక్టుల నిర్వహణను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. వెంటనే ఆయా ప్రాజెక్టుల గేట్లకు గ్రీసింగ్, కలరింగ్ పూర్తి చేయాలనీ, తూముల మరమ్మతులు ఉంటే వెంటనే చేపట్టాలని ఆదేశించారు. వర్షాకాలం వచ్చేనాటికి అన్ని పనులను పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్, ఇతర విభాగాల ఇంజినీర్ ఇన్ చీఫ్‌లు నాగేందర్, హరిరామ్, అంతరాష్ట్ర జలమండలి అధికారులు, చీఫ్ ఇంజి నీర్లు, సూపరింటెండెంట్ ఇంజినీర్లు, ఈఈలు తదితరులు పాల్గొన్నారు.