Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ అనుసరించిన విధానాలను, నిర్లక్ష్యాన్ని ప్రజలు ఇంకా మరిచిపోలేదని తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షులు పి శ్రీహరిరావు సోమవారం ఒక ప్రకటనలో గుర్తుచేశారు. 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారని తెలిపారు. నాటి విధానాల వల్లనే ఇప్పటికీ కొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను ఆనాటి ప్రభుత్వం ఆదుకోలేదని తెలిపారు. రాహుల్ గాంధీకి అప్పట్లో ఎన్ని లేఖలు ఇచ్చినా స్పందించలేదని గుర్తుచేశారు. స్వామినాథన్ కమిషన్ సిపారసులను గతంలో అమలు చేసిే ఉంటే నేడు ఈ పరిస్థితి ఉండేది కాదని తెలిపారు. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసందానం చేయలేదనీ, పంటలకు కనీస మద్దతు ధరలను చట్టబద్దం ఎందుకు చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టులు కట్టకుండా అడ్డుకున్నదే కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు.