Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బసవేశ్వరుని జయంతి సందర్భంగా వీరశైవ లింగాయత్, లింగ బలిజలకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో వర్ణ,కుల,లింగ వివక్షతను రూపుమాపడం కోసం అహర్నిశలు కృషి చేసిన అభ్యుదయవాది బసవేశ్వరుడని ఆయన సోమవారం ఒక ప్రకటనలో కొనియాడారు. సాహితీవేత్తగా, ఆనాటి పాలన వ్యవస్థలో భాగస్వామిగా, సమానత్వం కోసం, ప్రజాసంక్షేమ కోసం పోరాడిన బసవేశ్వరుని సిద్ధాంతం కార్యాచరణ గొప్పదని అభివర్ణించారు. భారత మత, సామాజిక చరిత్రలో విప్లవాత్మకమైనదిగా నిలిచిందని తెలిపారు. మానవీయమైన బసవేశ్వరుని ఆశయాలు నేటికీ ఆచరణీయమని పేర్కొన్నారు.