Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ)లో కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్‌గాంధీతో విద్యార్థుల ముఖాముఖీ కార్యక్రమానికి ఆ వర్సిటీ వీసీ అనుమతి ఇవ్వని కారణంగా ఈ అంశంపై ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఓయూలో విద్యార్థులు, నిరుద్యోగులతో రాహుల్ ముఖాముఖి నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఎన్ఎస్యూఐ సభ్యులు మానవతారారు, మరో ముగ్గురు రిట్ దాఖలు చేశారు. వీసీ అనుమతి ఇవ్వలేదనీ, రాజకీయ సమావేశాలకు ఓయూ క్రీడా ప్రాంగణం ఇవ్వడానికి వీల్లేదని ప్రభుత్వం చెప్పిందని గుర్తు చేశారు. వీసీ అనుమతి ఇవ్వకపోడంపై అభ్యంతరం ఉంటే పిటిషనర్లు తిరిగి మళ్లీ కేసు వేసుకోవచ్చునని హైకోర్టు సూచించింది. ప్రస్తుత రిట్‌పై విచారణను హైకోర్టు ముగించింది.
స్మితా సబర్వాల్‌కు ఎదురుదెబ్బ
ఔట్లుక్ పత్రికపై పరువు నష్టం కేసు దాఖలు చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ప్రభుత్వం నుంచి కోర్టు ఖర్చుల నిమిత్తం డబ్బులు తీసుకోవడం చెల్లదని హైకోర్టు తీర్పు చెప్పింది. ప్రయివేట్ వ్యక్తిగత పరువు నష్టం కేసులో న్యాయ సాయం కింద ప్రభుత్వం రూ.15 లక్షలు చెల్లించడం రాజ్యాంగ వ్యతిరేకమని స్పష్టం చేసింది. ఆ మొత్తాన్ని 90 రోజుల్లో ఆమె ప్రభుత్వానికి చెల్లించాలనీ, లేకపోతే ఆ తర్వాత 30 రోజుల్లోగా ఆ మొత్తాన్ని ప్రభుత్వం ఆమె నుంచి వసూలు చేయాలని తీర్పు చెప్పింది. ఆమెకు ప్రభుత్వం రూ.15 లక్షలను కోర్టు ఖర్చుల నిమిత్తం 2015లో చెల్లించడాన్ని సవాల్ చేస్తూ నగరానికి చెందిన వేణుగోపాల్ మరొకరు దాఖలు చేసిన రిట్లను హైకోర్టు అనుమతించింది. ఔట్‌లుక్‌పై ఆమె రూ.10 కోట్లకు పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే.