Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేఆర్ఎంబీ ఛైర్మన్‌కి రాష్ట్ర ప్రభుత్వం లేఖ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి - హైదరాబాద్
కృష్ణా జలాల వినియోగం 66:34 నిష్పత్తి విధానం తమకు సమ్మతం కాదని తెలంగాణ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, కేఆర్ఎంబీ చైర్మెన్ కు సోమవారం లేఖ రాశారు. తెలంగాణ సర్కారు వాదనలను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశ ఎజెండాలో సరైనవిదంగా నమోదు చేయాలని పేర్కొంది. ఈ నెల ఆరో తేదీన కేఆర్ఎంబీ వార్షిక సమావేశాన్ని నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఆ బోర్డు సమావేశానికి సంబంధించి 16 అంశాలపై కేఆర్ఎంబీ ఎజెండాను రూపొందించింది. అందులో కష్ణా జలాల పంపిణీ అంశం ఒకటి. వాస్తవంగా ఏపీ పునర్విభజన అనంతరం తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు తాత్కాలిక ఏడాది కాల ఒప్పందం మేరకు 66ః34 నిష్పత్తిలో కృష్ణా జలాలను వినియోగించుకుంటూ వస్తున్నాయి. ఆ ఒప్పందాన్ని 2020-21 నీటి సంవత్సరం వరకు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పొడగించు కుంటూ వస్తున్నారు. అయితే గతేడాది జరిగిన బోర్డు మీటింగ్‌లో మాత్రం తెలంగాణ దీనిపై అభ్యంతరం తెలిపింది. 66ః34 నిష్పత్తిలో కష్ణా జలాల వినియోగానికి ససేమిరా అని తన అభిప్రాయం తెలిపింది. ట్రిబ్యునల్ కేటాయింపులు పూర్తయ్యేంతవరకూ 50ః50నిష్పత్తిలో కష్ణా జలాలను వినియోగించు కుంటామని బోర్డు నివేదించింది. తుదకు పోతిరెడ్డిపాడు ద్వారా కేవలం 34 టీఎంసీలను మాత్రమే ఏపీ తరలించుకుపోవాలని, ఆ మేరకు కట్టడి చేయాలని షరతు విధించింది. అందుకు కేఆర్ఎంబీ ఒప్పుకోవడంతో 66ః34 నిష్పత్తిలో జలాల వినియోగానికి మరోసారి అంగీకరించింది. ఇదిలా ఉండగా, తాజాగా కేఆర్ఎంబీ రూపొందించిన బోర్డు మీటింగ్ ఎజెండాలో ఈ అంశాలేవీ లేకపోవడంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అసంతప్తి వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలను, విధించిన షరతులను ఎజెండాలో పొందుపరచకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.