Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రకటన
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ పార్టీ ఈనెల ఆరున వరంగల్‌లో నిర్వహించనున్న రైతు సంఘర్షణ సభ నిర్వహణ కోసం వివిధ కమిటీలను ప్రకటించింది. మంగళవారం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్ ఆయా కమిటీలను ప్రకటించారు. రిసెప్షన్ కమిటీ చైర్మెన్‌గా రేవంత్‌రెడ్డి, సమన్వయ కమిటీ చైర్మెన్‌గా ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, మీడియా, పబ్లిక్‌సిటీ కమిటీ చైర్మెన్‌గా మధుయాష్కీగౌడ్, బహిరంగసభ పర్యవేక్షణ కమిటీ చైర్మెన్‌గా ఎం అంజన్‌కుమార్‌యాదవ్, ప్రొటోకాల్ కమిటీ చైర్మెన్ బి మహేష్‌కుమార్‌గౌడ్, ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పాట్ల కమిటీ చైర్మెన్‌గా ఎమ్మెల్యే జగ్గారెడ్డి, వేదిక పర్యవేక్షణ కమిటీ చైర్మెన్ ఎమ్మెల్యే దూద్దిళ్ల శ్రీధర్‌బాబు, జనసమీకరణ కోసం పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఇన్చార్జిలు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, జెట్టి సుకుమకుమార్, టి జగ్గారెడ్డి, షబ్బీర్ అలీ, రాములునాయక్, జి నిరంజన్‌తోపాటు ఇతర కమిటీలకు చైర్మెన్లు, సభ్యులను ప్రకటించారు.