Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చంచల్‌గూడ సూపరింటెడెంట్‌కు రేవంత్ వినతి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
చంచల్‌గూడ జైల్లో ఉన్న విద్యార్థి నేతలతో రాహుల్‌గాంధీ ములాఖత్ అయ్యేందుకు అనుమతి ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి జైల్ సూపరింటెడెంట్‌ను కోరారు. సోమవారం హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలుకు వెళిన ఆయన వినతిపత్రం సమర్పించారు.అనంతరం రేవంత్ విలేకర్లతో మాట్లాడుతూ ఓయూకు వచ్చేందుకు రాహుల్‌గాంధీకు అనుమతి ఇవ్వాలంటూ ఎన్ఎస్యూఐ నేతలు కోరితే, వారిని అక్రమంగా జైలుకు పంపించారని చెప్పారు. ఈనెల 7న బలమురి వెంకట్‌తోపాటు మరో18 మంది నాయకులను కలిసేందుకు రాహుల్గాంధీతోసహా ఇతర నేతలంతా వస్తారానీ, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరినట్టు తెలిపారు. ఈ విషయంలో జైలు అధికారులు స్వతంత్రంగా వ్యవహరించాలని కోరారు. రాహుల్‌గాంధీకి అనుమతితోపాటు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఓయూ పర్యటనపై తమ నేతలు వీసీని కలిశారని చెప్పారు. విద్యార్థి సంఘాలు, ఉద్యమకారులు రాహుల్ రావాలని కోరినట్టు గుర్తు చేశారు. కేసీఆర్ ఒత్తిడి వల్ల రాహుల్‌గాంధీకి అనుమతికి ఇవ్వకుండా తిరస్కరించారని ఆరోపించారు. విద్యార్థులు రాజకీయాలకు అతీతంగా ఆయన పర్యటన ఉంటుందని వీసీకి విజ్ఞప్తి చేసినప్పటికీ నిరాకరించారని తెలిపారు. ఓయూకు వెళ్లిన విద్యార్థి నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైల్లో బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓయూలో విద్యార్థి నాయకులను కలవాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారని చెప్పారు. కాంగ్రెస్ తెలంగాణను ఇవ్వకుంటే, కేసీఆర్, కేటీఆర్, కవిత ఈరోజు ఎక్కడ ఉండేవారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు జగ్గారెడ్డి, గీతారెడ్డి, అంజన్‌కుమార్‌యాదవ్, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్, అనిల్‌కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్, వినోద్‌రెడ్డి, మెట్టుసాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.