Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఎల్ఐసీని ప్రయివేటీకరించడంలో భాగంగానే ఆ సంస్థను ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు పెట్టారని బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బెఫీ) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ బీమా సంస్థను ఈ నెల 4న ఇష్యుకు తీసుకురావడం ద్వారా ప్రయివేటీకరణకు ద్వారాలు తెరిచినట్లయ్యిందని పేర్కొంది. విదేశీ, కార్పొరేట్, మార్కెట్ శక్తులకు అప్పగించే ఈ చర్యను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేసింది. పాలసీదారులు, ఉద్యోగులు, ఏజెంట్ల ఆసక్తులను కాపాడాలని బెఫి కోరింది.