Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటర్ బోర్డు కార్యదర్శికి టిగ్లా వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్ష నిర్వహణలో జరుగు తున్న అవకతవకలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఇంటర్మీడి యెట్ గవర్నమెంట్ లెక్చరర్స్ అసోసియేషన్ (టిగ్లా) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్‌ను సోమవారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం జంగయ్య, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పరుశరాములు కలిసి వినతిపత్రం సమర్పించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో వరుసగా ఆరేండ్ల నుంచి డీఈసీ జనరల్-2గా విధులు నిర్వహిస్తున్న హరిప్రసాద్‌ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో వరుసగా ఐదేండ్ల నుంచి డీఈసీలో పనిచేస్తున్న చిరంజీవిని తొలగించాలని కోరారు. జనగామ జిల్లాలో సీనియర్లకు కాకుండా జూనియర్లకు అవకాశమివ్వడం అన్యాయమని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో శ్రీనివాస్‌ను మూడేండ్లుగా డీఈసీలో పనిచేస్తున్నారనీ, ఇది బోర్డు నిబంధనలకు విరుద్ధమంటూ అతన్ని తీసుకోలేదని తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో సీనియర్ అధ్యాపకులు సత్తయ్యను, రంగారెడ్డి జిల్లాలో సీనియర్ అధ్యాపకులైన ఎం జంగయ్యను జనరల్-2గా నియమించాలని డిమాండ్ చేశారు. మల్టీజోన్-1లో పనిచేస్తున్న వై ఉజ్వల్‌కు మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో పరీక్షల విధులను కేటాయించడం బోర్డు నిబంధనలకు వ్యతిరేకమని విమర్శించారు. బుధవారం నాటికి వాటిపై చర్యలు తీసుకోకపోతే గురువారం ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.