Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐకేఎస్ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి
- మూసీ కాలుష్య పరిశోధకులు దొంతి నరసింహారెడ్డి
నవతెలంగాణ -భువనగిరి
రాష్ట్రంలో టీఆర్ఎస్ ఇచ్చిన ఎన్నికల వాగ్దానాల్లో అతి ముఖ్యమైన మూసీ ప్రక్షాళన హామీని మర్చిపోయి మొద్దు నిద్రలో ప్రభుత్వం ఉన్నదని అఖిల భారత కిసాన్ సంఘం (కేవీపీఎస్) ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, మూసీ కాలుష్య పరిశోధకులు దొంతి నరసింహారెడ్డి అన్నారు. సోమవారం యాదాద్రిభువనగిరి జిల్లాకేంద్రంలోని పెన్షనర్స్ భవనంలో ఏర్పాటుచేసిన 'మూసీ ప్రక్షాళన - ఆధునీకరణ' వర్క్‌షాప్‌లో వారు మాట్లాడారు. రాష్ట్రంలో టీిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూసీ ప్రక్షాళన కోసం బడ్జెట్లో రూ.16,600 కోట్లు కేటాయించిందనీ, ఆ నిధులన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. పేరుకు మాత్రమే మూసీ కాలుష్య నియంత్రణ మండలి ఉందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా 31 మురికినీటి శుద్ధి కేంద్రాలు ఉన్నా కేవలం 5 మాత్రమే పనిచేస్తున్నాయని తెలిపారు. విచ్చలవిడిగా ఫార్మా కంపెనీలకు అనుమతులివ్వడంతో అవి.. పరిశ్రమల్లోని వ్యర్థాలను మూసీ కాలువలోకి వదలడంతో నీరు కాలుష్యమవుతున్నాయని తెలిపారు. తెలంగాణ రైౖతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టి.సాగర్ మాట్లాడుతూ.. హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్ లను శుద్ధిచేసి కొండపోచమ్మ డ్యాంలో కలుపుతామని మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీ ఎక్కడకు పోయిందని ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగడం, వ్యవసాయం దిగుబడులు తగ్గడం వల్ల రైతాంగం పూర్తిగా సంక్షోభంలోకి నెట్టబడుతుందన్నారు. మూసీ కాలుష్యం వల్ల వ్యవసాయ దిగుబడులు తగ్గాయన్నారు. ప్రభుత్వం వెంటనే కాళేేశ్వరం ప్రాజెక్టు నుంచి వస్తున్న బస్వాపూర్ రిజర్వాయర్‌ను పూర్తిచేసి రైతాంగానికి సాగునీరు అందించాలని, గంధమల్ల రిజర్వాయర్ పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండీ జహంగీర్, రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మేక అశోక్ రెడ్డి, మాటూరి బాలరాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొండమడుగు నర్సింహ, ఐద్వా జిల్లా కార్యదర్శి బట్టుపల్లి అనురాధ, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, ఉపాధ్యక్షులు కల్లూరి మల్లేష్, కెేవీపీఎస్ జిల్లా కార్యదర్శి సిర్పంగి స్వామి, నాయకులు మాయ కృష్ణ, బొడ్డుపల్లి వెంకటేష్, దయ్యాల నర్సింహ, పగిళ్ళ లింగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.