Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక దినోత్సవం ఘనంగా జరిగింది. పదుల సంఖ్యలో జర్నలిస్టులు హాజరయ్యారు. మే డే వర్థిల్లాలి, జర్నలిస్టుల ఐక్యత వర్థిల్లాలి అంటూ నినాదాలు చేశారు. టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం. సోమయ్య జెండావిష్కరణ చేశారు. ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య మే డే విశిష్టతను వివరించారు. హక్కుల దినం కోసం లక్షలాది మంది తమ రక్తాన్ని ధారోపోశారని వ్యాఖ్యానించారు. చికాగో వీధుల్లో ఎనిమిది గంటల పనిదినాల కోసం ఉద్యమించారని గుర్తు చేశారు. కార్మికులకు నిజమైన పండుగ మే డేనని చెప్పారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు, ఇతర కార్మికులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ ఉపాధ్యక్షులు పి.ఆనందం, కార్యదర్శి ఎస్.కె.సలీమా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. జగదీశ్, ఎస్.వెంకన్న, హెచ్‌యూజే కార్యదర్శి కొప్పు నిరంజన్, ఉపాధ్యక్షులు బీవీన్ పద్మరాజు, నాయకులు బి. రాజశేఖర్, గండ్ర నవీన్, లలిత, విజయ, శశికళ తదితరులు పాల్గొన్నారు.