Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వెల్దండ
వెల్దండ మండల పరిధిలోని కొట్ర గ్రామంలో కొట్ర గ్రామ సేవా సమితి, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొనుగోటి రవీందర్ రావు ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు సోమవారం ఇఫ్తార్ విందు ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా స్థానిక మసీదులో ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మసీదు ఆవరణలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు వంటకాలు వడ్డించి వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో బషీరుద్దీన్, రవీందర్ యాదవ్, మల్లేష్, వెంకటేష్, అర్జున్, అఫ్సర్, వెంకటయ్య, అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.