Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కృష్ణా ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న కేంద్ర గెజిట్‌ను రద్దు చేయాలనీ, నల్లగొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను తొందరగా పూర్తి చేయాలనే డిమాండ్‌తో టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ యాత్ర నిర్వహించనున్నారు. బుధవారం నుంచి ఈ న్ఱెల తొమ్మిది వరకు నల్లగొండ జిల్లాలో 150 కిలోమీటర్ల మేర సాగే ఈ యాత్రలో పాల్గొనేందుకు మంగళ వారం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఆయన బయలుదేరి వెళ్లారు. మొదటి రోజు సాయంత్రం 4 గంటలకు ఉదయసముద్రం, పానగల్ నుంచి యాత్ర మొదలై తొమ్మిదిన నక్కలగండి ప్రాజెక్టు వద్ద ముగుస్తుంది. అర్జాలబావి, చర్లపల్లి, యం.జి.యూనివర్సిటీ, ఎల్లారెడ్డి గూడెం, చెరువుగట్టు తదితర ప్రాంతాల మీదుగా యాత్ర కొనసాగనున్నది.