Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర వైద్యవిద్య విభాగంలో 115 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు లభించనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యవిద్య సంచాలకులు డాక్టర్ కె.రమేశ్ రెడ్డి సర్క్యులర్ విడుదల చేశారు. డీవీఎల్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, ఆప్తల్మాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, సైకియాట్రీ, అనాటమీ, ఫోరెన్సిక్ సైన్స్, మైక్రో బయాలజీ, ఫార్మకాలజీ, ఫిజియాలజీ తదితర విభాగాల నుంచి 115 మందిని స్క్రీనింగ్ కమిటీ ఎంపిక చేసింది. వీరికి ఈ నెల ఏడున కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు.