Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్పీఏ ప్రభుత్వం వద్ద సమాధానముందా?
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థ పవన్ హ్యాన్స్ను ప్రయివేటు పరం చేయటాన్ని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు విమర్శించారు. ఈ మేరకు మంగళవారం ట్వీట్ చేశారు. ఆరు నెలల క్రితం నెలకొల్పిన ప్రయివేటు కంపెనీకి రూ.ఒక లక్ష పెట్టుబడితో ప్రభుత్వరంగ సంస్థను వశం చేసుకునేలా చేయటం పట్ల చాలా ప్రశ్నలు, సందేహాలున్నాయని తెలిపారు. 2017లో పవన్ హ్యాన్స్ విలువ రూ.3,700 కోట్లు కాగా, దాంట్లో 49 శాతాన్ని కేవలం రూ.211 కోట్లకు అమ్మారంటూ పేర్కొన్నారు. దీనిపై నాన్ పర్ఫామెన్స్ అసెట్స్ గవర్నమెంట్ వద్ద ఏదైనా సమాధానముందా? అంటూ బీజేపీని ఉద్దేశించి ప్రశ్నించారు.