Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్ డివిజనల్ ఆఫీస్ వద్ద ర్యాలీ
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఎల్ఐసీ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ బుధవారం మధ్యాహ్నం రెండు గంటల పాటు వాకౌట్ సమ్మె నిర్వహిస్తున్నట్టు అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి జీ తిరుపతయ్య తెలిపారు. ఉద్యోగులు విధులను బహిష్కరించి హైదరాబాద్లోని ఎల్ఐసీ డివిజనల్ కార్యాలయంలో సెంట్రలైజ్డ్ ర్యాలీని నిర్వహిస్తున్నట్టు వివరించారు. లాభాల్లో ఉన్న ఎల్ఐసీని ప్రయివేటీకరించే చర్యల్ని కేంద్ర ప్రభుత్వం తక్షణం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం చర్యలు పాలసీదారుల ప్రయోజనాలకు ఏమాత్రం అనుకూలంగా లేవని అన్నారు.