Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఈనెల ఆరో తేదీ నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలకు నిమిషం నిబంధన ఎత్తేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వేసవి కాలం కావడం వల్ల విద్యార్థులు దూర ప్రాంతాలకు, సొంతూళ్లకు వెళ్లారని తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల గ్రామాలు ప్రయాణ సౌకర్యం లేకుండా ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో పేద విద్యార్థులు కచ్చితమైన సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునే అవకాశం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. నిమిషం నిబంధన వల్ల అనేక మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాకుండా నష్టపోయే అవకాశం ఉంటుందని తెలిపారు.