Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమాన అవకాశాలు కల్పించేందుకే.. : జిల్లా ప్రధాన న్యాయమూర్తి
నవతెలంగాణ-కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లా కోర్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న న్యాయాధికారి సేవా సంస్థలో ఆఫీస్ సబార్డినేట్‌గా అవుట్ సోర్సింగ్ పద్ధతిన నిజామాబాద్ నగరానికి చెందిన ట్రాన్స్‌జెండర్ అలకనందను నియమిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల ఉత్తర్వులను జారీచేశారు. ఆమెకు నియామకపత్రాన్ని అందజేశారు. అనంతరం సునీత మాట్లాడుతూ.. ట్రాన్స్జెండర్లు గౌరవప్రదమైన జీవితం కొనసాగించాలని ఆశించినా వారికి సరైనా ఉపాధి అవకాశాలు ఉండటం లేదన్నారు. సమాజంలో వారికి సైతం సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర న్యాయశాఖ చరిత్రలోనే మొదటిసారిగా ట్రాన్స్‌జెండర్‌ను నియమించినట్టు తెలిపారు. న్యాయసేవాధికారి సంస్థ రాష్ట్ర చైర్మెన్, హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి, ఉమ్మడి జిల్లా పరిపాలన న్యాయమూర్తుల అనుమతితో నియామకం చేపట్టినట్టు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయ సేవ సంస్థ కార్యదర్శి, సివిల్ జడ్జి విక్రమ్, న్యాయమూర్తి కేసీపీ వినీత్, సబ్ పర్యవేక్షకులు చంద్రశేఖర్‌రెడ్డి, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.