Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిద్దిపేట ప్రభుత్వాస్పత్రిలో ఆపరేషన్ విజయవంతం
- వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
నవ తెలంగాణ-సిద్దిపేట
గాంధీ, ఉస్మానియా ఆస్పత్రికి పరిమితమైన మోకాలి చిప్పలు మార్పిడి ఆపరేషన్ త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో ప్రారంభిస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సిద్దిపేటలో మొదటిసారిగా ముగ్గురికి మోకాలి చిప్పల మార్పిడి ఆపరేషన్ విజయవంతం కావడం సంతోషంగా ఉందన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మోకాలి చిప్పలకు ఆపరేషన్ చేయించుకున్న రోగులు బాపురెడ్డి, యాదయ్య, యాదగిరిలను మంత్రి హరీశ్‌రావు మంగళ వారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేట ఆస్పత్రిలో వారానికి నలుగురు నుంచి ఆరుగురికి మోకాళ్ల చిప్పల మార్పిడి చేయాలని వైద్యులకు సూచించారు. ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని ప్రజలకు సూచించారు. సీఎం కేసీఆర్ ఆలోచనలు అమలవుతు న్నాయన్నారు. దత్తత తీసుకున్న కొల్గురు గ్రామంలో క్యాంపు నిర్వహించాలని వైద్యులకు సూచించారు. ఆపరేషన్‌లో పాల్గొన్న వైద్య బృందాన్ని మంత్రి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ కాశీనాథ్, వైద్యులు తమిళ అరుసు, చందర్, తిమ్మారెడ్డి, రామకృష్ణా రెడ్డి, కిషోర్, వేణుగోపాల్, ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.