Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాక్టర్ రాజీవ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలో రోజు రోజుకు అస్తమా రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కాపాడుకునేందుకు ప్రజలు అవగాహన పెంచుకోవాలని పల్మనాలజిస్ట్, సీనియర్ రెసిడెంట్ డాక్టర్ రాజీవ్ నాయక్ సూచించారు. ప్రపంచ అస్తమా దినోత్సవం సందర్భంగా మంగళవారం హైదరాబాద్లోని ప్రభుత్వ చెస్ట్ ఆస్పత్రి ప్రాంగణంలో ప్రదర్శన, అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా డాక్టర్ రాజీవ్ మాట్లాడుతూ వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగా చాలామంది కొన్నిరకాల దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నారనీ, అందులో అస్తమా ముఖ్యమైనదని తెలిపారు. దగ్గు, ఛాతి బిగిసిపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నిద్రలో గురకపెట్టడం తదితరమైనవి ఈ వ్యాధి లక్షణాలని చెప్పారు. ఇలాంటి శ్వాస కోస వ్యాధులున్న వారు రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలనీ, సమతుల్య ఆహారం తీసుకోవాలని కోరారు. శరీర బరువు అదుపులో ఉంచుకోవాలనీ, దినచర్యలో వ్యాయామం, శారీరక శ్రమ చేయాలనీ, పొగ తాగడం మానేయాలనీ, ప్రాసెసింగ్ ఆహారానికి దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి డాక్టర్లు, నర్సులు, సిబ్బంది పాల్గొన్నారు.