Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్ర్రానికి హైకోర్టు నోటీసులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో వయోపరిమితిని 44 ఏండ్ల నుంచి 49 ఏండ్లకు పెంచేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలన్న రిట్‌పై హైకోర్టు స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఏప్రిల్‌లో వినతిపత్రమిచ్చామనీ, 2017 నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ లేనందున ఆ నాలుగేండ్ల వయోపరిమితి పెంపునకు ఆదేశాలివ్వాలని వెంకన్న, తదితర పిటిషనర్లు రిట్ దాఖలు చేశారు. వినతిపత్రంపై చర్యలు తీసుకుని కౌంటర్ పిటిషన్ ద్వారా తెలియజేయాలని న్యాయమూర్తి జస్టిస్ బి. విజరుసేన్ రెడ్డి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. నోటిఫికేషన్లు జారీ చేయని కాలాన్ని వయోపరిమితి పెంపునకు ఉత్తర్వులు ఇస్తేనే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని సూచించారు. దీనిపై హైకోర్టు.. పిటిషనర్ల ఫిర్యాదుపై నిర్ణయం తీసుకుని తదుపరి విచారణ జరిగే జూన్ 17న తెలియజేయాలని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది.