Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేపటి నుంచి అమల్లోకి...
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ (ఎమ్ఎమ్టీఎస్) సబర్బన్ రైళ్లలో ఫస్ట్‌క్లాస్ సింగిల్ జర్నీ చార్జీలను 50 శాతం తగ్గిస్తూ దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) నిర్ణయం తీసుకుంది. ఇది ఈనెల 5వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ఎస్సీఆర్ జనరల్ మేనేజర్ (ఇంచార్జ్) అరుణ్‌కుమార్ జైన్ తెలిపారు. ఫలక్‌నుమా - సికింద్రాబాద్ - హైదరాబాద్ - లింగంపల్లి - రామచంద్రాపురం మధ్య ప్రయాణించే ప్రయాణీకులకు ఈ నిర్ణయం ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కోవిడ్ లాక్డౌన్ అనంతరం ఎమ్ఎమ్టీఎస్ సర్వీసులను పునరుద్ధరించి శివారు ప్రాంతాల ప్రయాణికులకు ప్రయోజనం కలిగేలా సర్వీసుల సంఖ్యను క్రమంగా పెంచుతున్నామన్నారు. ప్రస్తుతం 29 రైల్వే స్టేషన్లను కవర్ చేస్తూ 50 కిమీల మీదుగా 86 సర్వీసులను నడుపుతున్నామని వివరించారు.