Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మూవీ ఈవెంట్స్, ప్రమోషన్స్ కంపెనీ శ్రేయాస్ మీడియా రూ.30 కోట్ల నిధులను సమీకరి స్తోంది. వ్యూహాత్మక, ప్రముఖ పెట్టుబడిదారులు ఈ నిధులను సమకూరుస్తున్నారని ఆ సంస్థ తెలిపింది. 2011లో ప్రారంభమైన హైదరాబాద్‌కు చెందిన తమ సంస్థ దక్షిణాదిన 1,500లకుపైగా ఈవెంట్స్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లు పేర్కొంది. వీటిలో 1,000 దాకా సినిమా ప్రచార కార్యక్రమాలు ఉన్నాయని తెలిపింది. ఇటీవలే దుబాయిలో కార్యకలాపాలు ప్రారంభించినట్లు వెల్లడించింది. సమీకరించే నిధులను మధ్య ప్రాచ్య, యూఎస్, ఏషియా పసిఫిక్ తోపాటు దేశవ్యాప్తంగా విస్తరణకు ఉపయోగించనున్నామని శ్రేయాస్ గ్రూప్ ఫౌండర్ గండ్ర శ్రీనివాస్ రావు తెలిపారు. కంపెనీ 2027 నాటికి ఏటా 650 మూవీ ఈవెంట్స్, 120 మూవీ ప్రమోషన్స్ చేపట్టాలని లక్ష్యంగా చేసుకుందన్నారు.