Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బోయినపల్లి వినోద్ కుమార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పరీక్షలను ఏ భాషలో నిర్వహిస్తున్నారనే దానికి సంబంధించిన అవగాహన లేకుండా బీజేపీ ఎంపీలు బండి సంజరు, ధర్మపురి అరవింద్ యువతను రెచ్చగొడుతున్నారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్ ప్రకారం దేశ వ్యాప్తంగా ఉర్దూ భాషలో యూపీఎస్సీ, పలు రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలను అభ్యర్థులు రాస్తున్నారని తెలిపారు. తెలంగాణలో మాత్రమే కొత్తగా ఉర్దూలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు జరుగుతున్నాయంటూ వక్రీకరించడం ద్వారా యువతను రెచ్చగొట్టొద్దని బీజేపీ నేతలకు హితవు పలికారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ ఇదే విధంగా జరిగాయని గుర్తుచేశారు. రాజ్యాంగం ప్రకారం 22 భాషల్లో ఏ భాషలోనైనా సివిల్ సర్వీసెస్ పరీక్షలు లేదా ఆయా రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసే హక్కు భారత పౌరులకు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించిన 2014 నుంచి 2022 వరకు జారీ అయిన యూపీఎస్సీ పరీక్షల షెడ్యూల్, నోటిఫికేషన్లో కూడా ఐ.ఏ.ఎస్., ఐ.పీ.ఎస్., ఐ.ఎఫ్.ఎస్. వంటి ఉద్యోగాల కోసం ఉర్దూలో పరీక్షలు రాస్తున్నారని వినోద్ కుమార్ తెలిపారు.