Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్ నగరంలో మరో కెమిస్ట్రీ టెక్నాలజీ హబ్ అందుబాటులోకి వచ్చింది. బుధవారం హైదరాబాద్ లోని డాక్టర్ రెడ్డీస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ ప్రాంగణంలో రాష్ట్ర పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ దీన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫార్మారంగంలో ప్రభావవంతమైన, సుస్థిరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకొచ్చే లక్ష్యంతో హబ్ పని చేయనున్నదని తెలిపారు. దేశంలోనే ఇదే మొదటి ఫ్లో కెమిస్ట్రీ టెక్నాలజీ హబ్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో లారస్ ల్యాబ్స్ సీఈవో డాక్టర్ సత్యనారాయణ చావ, లైఫ్ సైన్సెస్, ఫార్మా డైరెక్టర్ శక్తి నారప్పన్ తదితరులు పాల్గొన్నారు.