Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్సిటీ నిర్ణయంలో జోక్యానికి హైకోర్టు నిరాకరణ
- ఎన్ఎస్యుఐ పిటిషన్ డిస్మిస్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
శనివారం ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్‌గాంధీతో కార్యక్రమాన్ని నిర్వహించాలని ఎన్ఎస్యుఐ చేసిన ప్రయత్నాలు బెడికొట్టాయి. విద్యార్థులు, నిరుద్యోగులతో ముఖాముఖీ కార్యక్రమానికి రాహుల్ హాజరవుతారనీ, అయితే యూనివర్సిటీకి సమర్పించిన వినతిపత్రాన్ని తిరస్కరిస్తూ రిజిస్ట్రార్ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని దాఖలైన రిట్‌ను హైకోర్టు కొట్టేసింది. వర్సిటీ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని చెప్పింది. ఈ మేరకు జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డి బుధవారం తుది ఉత్తర్వులు జారీ చేశారు.తొలుత పిటిషనర్ తరపు అడ్వకేట్ కరుణాకర్‌రెడ్డి వాదిస్తూ, వర్సిటీ నిర్ణయాన్ని రద్దు చేసి రాహుల్ పర్యటనకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ మేరకు తాము దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్లో ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, నిరుద్యోగులతో రాహుల్‌గాంధీ ముఖాముఖి కార్యక్రమానికి వర్సిటీ రిజిస్ట్రార్ అనుమతి నిరాకరించడంపై ఎన్.ఎస్.యు.ఐ సభ్యులు మానవతారారు, మరో ముగ్గురు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అనుమతి ఇవ్వకపోవడానికి రిజిస్ట్రార్ చెప్పిన కారణాలు సరికాదని లాయర్ వాదించారు. శనివారం వర్సిటీ ఉద్యోగుల అసోసియేషన్ ఎన్నికలు ఉన్నాయంటూ రిజిస్ట్రార్ చెప్పారనీ, రాహుల్‌తో భేటీ ఆడిటోరియంలో జరుగుతున్నందున ఇది ఎన్నికలకు ఎలాంటి అడ్డంకి కాదన్నారు. ఎంబీఏ పరీక్షలు ఉన్నాయని మరో కారణం చూపారనీ, అయితే పరీక్ష రాసే విద్యార్థులు ఎవరూ పిటిషనర్లను ముఖాముఖి కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాలని కోరలేదన్నారు.