Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతిమ ఆస్పత్రిలో కాలేయమార్పిడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పేద కుటుంబానికి చెందిన 11 నెలల అర్హాన్కు హైదరాబాద్లోని ప్రతిమ ఆస్పత్రిలో ఉచితంగా శస్త్రచికిత్స నిర్వహించారు. జన్యుపరమైన అలగెల్లె సిండ్రోమ్ వ్యాధితో బాధపడుతున్న ఆ బాలుడికి చేసిన కాలేయమార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైనట్టు ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రతిమ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ ప్రతీక్ బోయినపల్లి తెలిపారు. బాలుడి పరిస్థితి దష్ట్యా ఆపరేషన్ థియేటర్, ఆపరేషన్ తర్వాత ఐసీయూ, నర్సింగ్, వైద్య సేవలను పూర్తి ఉచితంగా అందించారు. చికిత్సకు అవసరమయ్యే సర్జికల్ పరికరాలు, ఇతరత్రా ఔషధాలను క్రౌడ్ ఫండింగ్ ద్వారా సేకరించినట్టు శస్త్రచికిత్సకు నేతత్వం వహించిన డాక్టర్ సీహెచ్.మధుసూదన్ తెలిపారు. బాలుడు గుండె, ఎముకలకు సంబంధించిన సమస్యలతో కూడా బాధపడుతుండటం, ఏడున్నర కిలోల బరువుకు తగ్గిపోవడంతో శస్త్రచికిత్స సంక్లిష్టమైందిగా మారింది. అప్పటికే పలు ఆస్పత్రులు తిరిగిన తల్లిదండ్రులు ఆశలు వదులుకుంటున్న సమయంలో ప్రతిమ అండగా నిలిచిందనీ, ఆస్పత్రిలో తక్కువ ఖర్చుతో అంతర్జాతీయ సేవలందిస్తున్నామని డాక్టర్ ప్రతీక్ బోయినపల్లి తెలిపారు.