Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఐడిఏ బొల్లారం
స్టీల్ పరిశ్రమలో బాయిలర్ పేలడంతో ఓ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా బొల్లారం పారిశ్రమికవాడ మీనాక్షి స్టీల్ పరిశ్రమలో బుధవారం తెల్లవారుజామున 6 గంటల సమయంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... మీనాక్షి పరిశ్రమలో బాయిలర్ పేలడంతో దాని దగ్గర పనిచేస్తున్న కార్మికుడు హేమంత్ కుమార్(25) పూర్తిగా కాలిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. అక్కడే ఉన్న మరో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడటంతో వారిని సమీపంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన కార్మికుడు హేమంత్‌కుమార్ అంత్యక్రియలకు పరిశ్రమ యాజమాన్యం రూ.1.20లక్షల నష్టపరిహారం అందజేసింది.