Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం నమ్మకాన్ని వమ్ము చేయొద్దు : మంత్రి కె.తారకరామారావు
నవతెలంగాణ - ఎల్లారెడ్డిపేట
శతాబ్దాలుగా సామాజిక వివక్షకు, అణచివేతకు గురవుతున్న దళితులు సాధికారిత, స్వావలంబన సాధించేందుకే రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని అమలు చేస్తోందని ఐటీ, పురపాలక, పట్టణా భివృద్ధి శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండ లంలో బుధవారం పలు గ్రామాల్లో మంత్రి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. పదిరకు చెందిన దళితబంధు లబ్ది దారులు ముగ్గురు అక్కపల్లి శివారులో నిర్మిచుకో నున్న నాలుగు టన్నుల సామర్థ్యం గల రారైస్ మిల్లు నిర్మాణానికి కేటీఆర్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. మేధావులతో సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం దళిత కుటుంబాల ఆర్థిక అభ్యున్నతిని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. రాజకీయ లబ్ది కోసమో, ఓట్ల కోసమో ప్రవేశపెట్టలేదన్నారు. సీఎం కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా దళితబంధు పథకాన్ని సద్వినియోగం చేసుకుంటూ కూలీల నుంచి యజ మానులుగా, సక్సెస్ఫుల్ వ్యాపారవేత్తలుగా ఎద గాలని సూచించారు. ఎలాంటి బ్యాంకు గ్యారెంటీలు లేకుండానే నేరుగా లబ్దిదారులకు రూ.10లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేసే పథకం దేశంలోనే మరెక్కడా లేదని చెప్పారు. లబ్దిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్లకు సంబంధించి వ్యాపార నిర్వహణను సొంతంగా చేసుకోవాలన్నారు. పదిరకు చెందిన 9 మంది దళిత బంధు పథకంలో భాగంగా హరిదాస్‌నగర్‌లో ఏర్పాటు చేయనున్న పెట్రోల్ బంక్‌కు భూమిపూజ చేశారు. బస్టాండ్ వద్ద వెంకట్‌రెడ్డి ఏర్పాటు చేసిన తల్లిబిడ్డను ఎత్తుకున్న చిహ్నం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఎన్.అరుణ, కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ బి.సత్యప్రసాద్, ఆర్డివో శ్రీనివాస్‌రావు, జిల్లా విద్యాధికారి డి.రాధాకిషన్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.