Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంస్మరణ సభలో పలువురు వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కమ్యూనిస్టు భావజాలంతో సమరశీల పోరాటాలు చేసిన గొప్ప మహిళా ఉద్యమకారిణి పి.లలిత జోషి అని పలువురు వక్తలు కొనియాడారు. బుధవారం హైదరాబాద్లోని ఏఐయూటీసీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె సంస్మరణ సభ జరిగింది. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ సయ్యిద్ అజీజ్ పాషా, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పశ్య పద్మ, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్. బోస్, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లులక్ష్మి, ఐద్వా జాతీయ నాయకులు జ్యోతి, ఇండియన్ అసోసియేషన్ అఫ్ లాయర్స్ ప్రధాన కార్యదర్శి బొమ్మగాని ప్రభాకర్, శ్రామిక మహిళా ఫోరమ్ రాష్ట్ర కన్వీనర్ పి. ప్రేమ్ పావని, సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఈటి. నరసింహ, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బి. వెంకటేశం, మహిళా సమాఖ్య రాష్ట్ర నేతలు నేదునూరి జ్యోతి, డాక్టర్ కె. రజిని, ఎస్. ఛాయా దేవి, పీఓడబ్ల్యూ రాష్ట్ర నేత ఝాన్సీ, వివిధ మహిళా సంఘాల నేతలు అంకురం సునీత, జోశ్యభట్ల కల్పనా, విమల, మనోరమ, ఇందిరా, సుధా తదితరులు పి. లలిత జోషి చిత్రపటానికి ఫూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మహిళా హక్కుల సాధనకు ఒక వైపు మహిళా సంఘాలతో మరొకవైపు ఎన్జీవో సంఘాలతో పనిచేస్తూ అనేక సామాజిక కార్యక్రమాల్లో ఆమె సేవలందించారని కొనియాడారు. బస్తీల్లోని మహిళా, సామాజిక సమస్యలపై పోరాడారని గుర్తుచేశారు. హక్కుల కోసం పోరాటాల్లోకి వచ్చే మహిళలను ఆమె నిరంతరం చైతన్యపరిచేవారన్నారు. లలిత జోషి మృతి మహిళా, సామాజిక హక్కుల ఉద్యమాలకు తీరనిలోటని తెలిపారు.