Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంషాబాద్
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డ్రగ్స్ కలకలం రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంది. అధికారులు డ్రగ్స్ స్వాధీనం చేసుకుంటున్నప్పటికీ మాఫియా మాత్రం డ్రగ్స్ అక్రమ రవాణా ఏ మాత్రం ఆపడం లేదు. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 26న టాంజానియా దేశానికి చెందిన వ్యక్తి జోహనెస్బర్గ్ నుంచి శంషాబాద్‌కు వచ్చాడు. అతడి కదిలకలు గుర్తించి అధికారులు అతడిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేశారు. అయితే అతని వద్ద ఉన్న వస్తువుల్లో ఎలాంటి మాదకద్రవ్యాలు కనిపించలేదు. కానీ అతడి నడవడికలో తేడా గమనించి కస్టమ్స్ అధికారులు తమదైన శైలిలో విచారించగా, హెరాయిన్ మాత్రలు మింగినట్టు అధికారులకు తెలిపాడు. అతడిని వైద్యుల పర్యవేక్షణలో పెట్టారు. ఆరు రోజుల తర్వాత బుధవారం వైద్య చికిత్స అనంతరం ప్రయాణికుడు నుంచి టేప్ చుట్టిన మాత్రలను కడుపు నుంచి బయటకు తీశారు. మొత్తంగా 108 మాత్రలను బయటకు తీసినట్టు వైద్యులు తెలిపారు. వాటి బరువు 1,389 గ్రాములు ఉన్నట్టు తెలిపారు. మార్కెట్లో వీటి విలువ రూ. 11.53కోట్లు ఉంటుందని తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు తెలిపారు.