Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మతాంతర వివాహం చేసుకున్నందుకు నడిరోడ్డుపై యువకుడి హత్య
నవతెలంగాణ-సరూర్‌నగర్
మతాంతర వివాహం చేసుకున్నందుకు ఓ యువకుడిని నడిరోడ్డుపైనే దారుణంగా హత్య చేసిన సంఘటన హైదరాబాద్ సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. పోలీసులు.. స్థానికుల కథనం ప్రకారం ఓ కార్ల షోరూమ్‌లో సేల్స్‌మేన్‌గా పనిచేసే బిల్లాపురం నాగరాజు (25), సయ్యద్ ఆశ్రిన్ సుల్తానా జనవరి 31న ఆర్యసమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే సయ్యద్ ఆశ్రిన్ సుల్తానా కుటుంబ సభ్యులు వివాహానికి అడ్డు చెప్పినట్టు సమాచారం. ప్రేమ వివాహం చేసుకున్న వీరు తమకు రక్షణ కావాలని పోలీసులను కూడా ఆశ్రయించాడు. ప్రస్తుతం నవ జంట సరూర్‌నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో బిల్లాపురం నాగరాజు, సయ్యద్ ఆశ్రిన్ సుల్తానా ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. సరూర్‌నగర్ మున్సిపల్ కార్యాలయం పంజాల అనిల్ కుమార్ కాలనీ వద్ద గుర్తుతెలియని ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై వచ్చి నాగరాజు వాహనాన్ని అడ్డగించి అతనిపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడని ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డి తెలిపారు. మతాంతర వివాహమే యువకుడి హత్యకు కారణమని, దీనికి సంబంధించి విచారణ జరుపుతున్నామని పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీపీ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హత్య జరిగిన సంఘటన స్థలానికి క్లూస్ టీం కూడా చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు.