Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'మన చరిత్రను మనం రాసుకుందాం' కార్యక్రమానికి కాకతీయ విశ్వవిద్యాలయం'సై' అంటూ సంపూర్ణ మద్దతు తెలియజేసిందని తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మెన్ జూలూరు గౌరీశంకర్, కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ తాటికొండ రమేష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సాహిత్య అకాడమి చేపట్టిన ఈ కార్యక్రమ ప్రణాళికపై గురువారం చర్చించినట్టు తెలిపారు. కేయూసీ పరిధిలో ఉన్న 11 జిల్లాల్లోని డిగ్రీ,పీజీ కళాశాల విద్యార్థుల చేత గ్రామ చరిత్రలను రాయించేందుకు వీసీ సంసిద్దత వ్యక్తం చేశారని జూలూరు తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల నుంచి ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్న ఎస్ఆర్అండ్ బీజీఎన్ఆర్ కళాశాల నుంచి శ్రీకారం చుట్టేందుకు నిర్ణయించినట్టు పేర్కొన్నారు. విద్యార్థుల చేత తమ గ్రామ చరిత్రలను రాయించే పనికి సిద్ధం చేయటం సృజనాత్మకమైందని తెలిపారు.ఇప్పటికే నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాల విద్యార్థులు 200 గ్రామాల చరిత్రలను రాస్తున్నారని జూలూరు తెలిపారు.